డివిజన్ ల అభివృద్దే లక్ష్యం.

మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 11
నియోజకవర్గంలోని 9 డివిజన్లను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని గౌతమ్ నగర్ డివిజన్లోని మల్లికార్జున నగర్ లో 28 లక్షల వ్యయంతో ఆర్ సిసి పైపు లైన్ పనులను కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ తో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని సరస్వతి నగర్ లో 96 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.డివిజన్ లలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకు వస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఈకార్యక్రమంలో మెట్టుగూడ కార్పొరేటర్ రాసోరి సునీత,ఢీఈ లౌక్య, ఏఈ దివ్యజ్యోతి,ఏఈ శ్రీకాంత్,
సీనియర్ నాయకులు రాముయాదవ్, బాబు,సంపత్ రావు,జంగయ్య గౌడ్,మధు,బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

తాజావార్తలు