డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హరిప్రియ

టేకులపల్లి, ఆగస్టు 19( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని బోర్డు రోడ్డు సెంటర్ నుండి గుండాల వరకు వెళ్లే రహదారిలో రేగుల తండా నుండి దాసు తండా వరకు సి ఎస్ ఆర్ నిధుల నుంచి 2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో డివైడర్ నిర్మాణం పనుల కొరకు ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ శనివారం శంకుస్థాపన చేశారు. ఇంతకుముందు బోడు రోడ్డు సెంటర్ నుండి రేగుల తండా వరకు రోడ్డు విస్తరణలో భాగంగా డివైడర్ నిర్మాణం చేపట్టి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ప్రస్తుతం అదే రహదారిలో రేగుల తండా నుండి దాస్ తండా వరకు డివైడర్ నిర్మాణం పూర్తి చేసి అక్కడ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో నిత్యం కోయగూడెం ఓసి నుండి వందలాది లారీ, ట్రిప్పర్లు బొగ్గును రవాణా చేస్తున్న క్రమంలో ట్రాఫిక్ అంతరాలతో పాటు ప్రమాదాలు కూడా తగ్గనున్నాయి. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు భర్మావత్ లాల్ సింగ్ నాయక్, దాస్తండా గ్రామపంచాయతీ సర్పంచ్ బానోతు ప్రియాంక, ఎంపీటీసీ భూక్య బాలకృష్ణ, బిఆర్ఎస్ మండల కమిటీ నాయకులు, మండల కేంద్రంలోని స్థానికులు పాల్గొన్నారు.