హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి పార్థసారధిని సచివాలయంలో కలిశారు. 2012 డీఎస్సీ అభ్యర్థుల సమస్యను తక్షణం పరిష్కరించాలని మంత్రిని కోరారు. 2012 డీఎస్సీ నియామకాల్లో తొలి జాబితాను పక్కనపెట్టి రెండో జాబితా ప్రకారం నియామకాలు చేపట్టడం వల్ల 900 మంది అభ్యర్థులు నష్టపోయారని, వారికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయపర నిర్ణయం తీసుకుని ఉద్యోగాలు కోల్పోయిన 900 మందికి న్యాయం చేయాలన్నారు. పదిరోజుల్లో ఈ సమస్యని పరిష్కారిస్తానని మంత్రి పార్థసారధి హామి ఇచ్చినట్లు కోదండరాం చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తెలంగాణ ఐకాస వ్యతిరేకం కాదని శ్రీనివాసగౌడ్ అన్నారు. తెలంగాణ ఐకాస వల్లే అభ్యర్థులు నష్టపోయారంటూ కావాలని కొందరు కుట్రపూరితంగా ఆరోపిస్తున్నారని మండిపడ్డారు.




