Wednesday, 4 November 2026

డీలర్ల నియామక నోటిఫికేషన్ విడుదల…

తహసిల్దార్ శ్రీనివాసరావు…
శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 6
చౌక ధరల దుకాణాల డీలర్ల నియామక నోటిఫికేషన్, ఉన్నతాధికారులు విడుదల చేసినట్లు శంకరపట్నం తాసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో తాసిల్దార్ మాట్లాడారు మండలంలోని కేశవపట్నం జనరల్, కాచాపూర్ ఎస్సీ మహిళ, కొత్తగట్టు జనరల్ మహిళ, గద్దపాక బిసి బి, తాడికల్ ఎస్టి, గొల్ల పల్లె జనరల్, ఎస్సి మక్త ఈడబ్ల్యూఎస్, గద్దపాక బిసి బి, కల్వల జనరల్ మహిళ, రిజర్వేషన్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు హుజురాబాద్ డివిజనల్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని తాసిల్దార్ శ్రీనివాసరావు సూచించారు.