*డ్రైనేజీ గురించి చిన్నారి ఫిర్యాదు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే*
మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 16
(జనం సాక్షి)
మెట్పల్లి పట్టణానికి చెందిన గాలిపెళ్లి మహిజ అను విద్యార్థిని ఐదవ తరగతి చదువుతున్నది , ఆమె చదువుతున్న స్కూల్ దగ్గర గల డ్రైనేజీ విషయంలో ఇబ్బంది ఉండడంతో, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది . వెంటనే ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు స్పందించి సంబంధిత అధికారి అయిన
మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి ఇట్టి డ్రెయినేజీ ని వెంటనే మరమ్మత్తులు చేయించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. చిన్న వయసులోనే ధైర్యంగా వచ్చి ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన సందర్భంగా మహిజ కు పలువురు అభినందనలు తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కు మహిజ మరియు విద్యార్థిని , విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.