డ్రైనేజీ పనులు పరిశీలించిన మేయర్ బుచ్చిరెడ్డి
మేడిపల్లి – జనంసాక్షి
బోడుప్పల్ నగర పాలక సంస్థ సరిహద్దులో గల చిలుకానగర్ డివిజన్లోకి బోడుప్పల్ నుండి డ్రైనేజీ నీరు చేరి పొంగిపొర్లుతున్నందు వల్ల మేయర్ సామల బుచ్చిరెడ్డి ఆ ప్రాంతంలో పర్యటించి పనులను పరిశీలించారు. నగరపాలక సంస్థ నిధుల నుంచి 50 లక్షల కేటాయించి పనులు చేయించుటకు టెండర్ పూర్తిచేసి కాంట్రాక్టర్ కేటాయించినప్పటికీ నీరు రోడ్లపైకి చేరి దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే నిధులు కేటాయించి చాలా రోజులు అయిందని, ఈపాటికి పని పూర్తి కావాల్సి ఉండగా ఇంకా పూర్తి కాలేదని అధికారులను మందలించారు. ఈ కార్యక్రమంలో చిలుకానగర్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Attachments area