హైదరాబాద్,జూలై6(జనం సాక్షి): తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుని ఎవరి వాహనాలు వారే నడుపుకోవాలన్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. దీంతో దుబారా అరికట్ట గలమని అంటున్నారు. సీనియర్ పోలీస్ అధికారులు కూడా దీనిని సమర్థిస్తున్నారు. పోలీస్ శాఖలో ఓ స్థాయి వరకు డ్రైవర్లను తొలగిస్తుండగా… ఇకపై ఎవరి వాహనాలు వారే నడిపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ¬ంగార్డు స్థాయిలో నియామకాలు చేపట్టి, వారికి శిక్షణ ఇచ్చి డ్రైవర్లుగా నియమిస్తూ వచ్చారు. త్వరలో గస్తీ రూపురేఖలు పూర్తిగా మారిపోనుండగా…హైదరాబాద్‌లో నిర్మించే కమాండ్ కంట్రోల్ రూంకు రాష్ట్రంలోని గస్తీ వాహనాలను అనుసంధానం చేయబోతున్నారు. దీంతో వాహనాలకు డ్రైవర్ల అసవరం ఉండకపోవచ్చు. మారిన కాలానుగుణంగా పోలీస్ శాఖలోనూ మార్పులు అవసరమని అంటున్నారు.




