డ్రైవర్ ను అభినందించిన ట్రాఫిక్ సిఐ బాబులాల్

వరంగల్ ఈస్ట్, జూలై 19(జనం సాక్షి):
 మంగళవారం ఉదయం కానూరి ధనుష్  ఖమ్మంకు చెందిన స్టూడెంట్ పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ ఎస్ వి ఎస్ కాలేజ్-భీమారం హనుమకొండ జిల్లా నందు చదువుతున్నాడు ఈ రోజు శాతవాహన ట్రైన్ దిగి  వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గర ఆటో ఎక్కి హనుమకొండ పబ్లిక్ గార్డెన్ దగ్గర గల పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్లి చూసుకోగా అతని సంబంధించిన డాక్యుమెంట్స్ మరియు ఇతర సర్టిఫికెట్స్ గల ఫైల్ను పోగొట్టుకున్నాడు,  వీటిని తిరిగి రైల్వే స్టేషన్ దగ్గర వరంగల్ ట్రాఫిక్  సిఐ కి ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి ఆటో యూనియన్ వాళ్ళని పిలిపించి ఎంక్వయిరీ చేయగా కలకోట్ల విజయ్ కుమార్ ఆటో డ్రైవర్ స్పందించి మిస్ అయిన డాక్యుమెంట్లు తన దగ్గర ఉన్నాయని చెప్పి ఇప్పించడం జరిగింది,సిఐ  నిజాయితీని చాటుకున్న  ఆటో డ్రైవర్లని అభినందించారు.
 
Attachments area