కల్వకుంట్ల కవిత ,ఇతర పెద్దల పై విచారణ జరిపించాలి … చెరుకుపల్లి వెంకటరెడ్డి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ఢిల్లీ లిక్కర్ మాఫియా అక్రమాలపై నిగ్గుదెల్చాలని
ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారాలు అందించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న టిఆర్ఎస్
నాయకురాలు కల్వకుంట్ల కవిత ,ఇతర పెద్దల పై విచారణ జరిపించాలని కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు .
.నిరసన తెలుపుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసిన కారణంగా వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాల అని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ బడంగ్పేట్ కార్పొరేషన్ యువ మోర్చా అధ్యక్షులు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ , ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి , నాయకులు మాట్లాడుతూ… కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి తెలంగాణలో మద్యం ఏరులై పారుతూ, కొత్త మద్యం పాలసీ ద్వారా బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తూ, మద్యం ధరలను విపరీతంగా పెంచుతూ, తెలంగాణ ప్రభుత్వ ఆదాయం నిండేలా, సామాన్య ప్రజలు, మందు బాబుల కుటుంబాలను అధోగతి పాలు చేస్తున్నారని ఆరోపించారు . వారి ముఖ్య అనుచరులు మధ్యం ఆదాయంతో కోట్లు గడిస్తున్నారన్నారు. ఇదే తరహా పాలసీని ఢిల్లీ ప్రభుత్వం కూడా కొత్త పాలసీ విధానంతో కోట్లు గడించాలనె దురాశతో, ఇక్కడి తెలంగాణ నాయకుల ప్రత్యక్ష పరోక్ష వారి స్వ అనుభవాలతో, ఢిల్లి లిక్కర్ మాఫియా నడుస్తుందని కొన్ని పత్రిక సంస్థలు, మీడియా సంస్థలు, అన్ని సంస్థల వేళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వైపు చూపిస్తున్నాయని. ఇట్టి వ్యవహారాన్నికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలపై టిఆర్ఎస్ కార్యకర్తలు దౌర్జన్యంగా దాడి చేసి, తిరిగి బిజెపి కార్యకర్తల పైననే హత్యాయత్నం, దాడి అని నాన్-బేలబుల్ సెక్షన్లు పెట్టి, అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజలతో పాటు, దేశం మొత్తం చూస్తుందని, త్వరలోనే నిజాలు నిగ్గు తేలి, దోషులను కటకటాల్లోకి నెట్టే రోజులు వస్తాయి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సామ సంజీవరెడ్డి , ఏనుగు రామిరెడ్డి, గుర్రం మల్లారెడ్డి , నడికుడి యాదగిరి , రామిడి సుర కర్ణ రెడ్డి , కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, మాధురి వీర కర్ణ రెడ్డి, గౌరవ రమాదేవి శ్రీనివాస్ బ్యాంక్ డైరెక్టర్లు పెత్తుల పుల్లారెడ్డి, తోట ప్రతాప్ రెడ్డి, తిరుపతి గిరి రాజు కార్పొరేషన్ నాయకులు రామిడి మహేందర్ రెడ్డి, నవారు శ్రీనివాస్ రెడ్డి, గుండె నాగార్జున బాబు, వరికుప్పల వెంకటేష్, పోరెడ్డి జగన్మోహన్ రెడ్డి, మంత్రి మహేష్, కుంటి భాస్కర్, బంగారు బాబు, నిమ్మల రవికాంత్ గౌడ్, శివరాం రెడ్డి, శ్రీకంఠ స్వామి అడికె రవితేజ, బంగారు రాహుల్, పన్నాల శ్రీకృత్ రెడ్డి, భరత్ మొదలగువారు పాల్గొన్నారు




