తండ్రికి తగ్గ తనయుడు యూత్ ఐకాన్ మంత్రి కేటీఆర్

-ప్రపంచ దేశాల్లో తెలంగాణకు పేరు తెచ్చింది మంత్రి కేటీఆర్
-మండల అధ్యక్షుడు నున్న రమణ

మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన డోర్నకల్ బిఆర్ఎస్ శ్రేణులు.

డోర్నకల్,జూలై -24,జనం సాక్షి న్యూస్:తండ్రి కెసిఆర్ కి తగ్గ తనయుడు యూత్ ఐకాన్ మంత్రి కేటీఆర్, ప్రపంచ దేశాల్లో తెలంగాణకు మంచి పేరు తెచ్చిన మంత్రి గా ముందుకు సాగుతున్న ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అని డోర్నకల్ మండలం అధ్యక్షుడు నున్న రమణ అన్నారు.మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు డోర్నకల్ పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నున్న రమణ, ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్, మున్సిపల్ చైర్మన్ వీరన్న మాట్లాడుతూ తెలంగాణను ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా ముందుకు సాగుతూ మంచి పేరు తెచ్చారన్నారు. ఐటీలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న మంత్రిగా పేరు తెచ్చుకున్నారన్నారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేస్తున్న సేవలు ఘనమైనవి అని, తండ్రికి తగ్గట్టుగానే తనయుడు కూడా ప్రజలకు మంచి సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నా అన్నారు. అదేవిధంగా డోర్నకల్ మండలంలో 28 నుండి నిర్వహించే శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ గ్రామ గ్రామాన నిర్వహించే పర్యటను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని మండల అధ్యక్షులు నున్న రమణ అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం, వార్డు కౌన్సిలర్లు శరత్, అశోక్, సురేందర్ జైన్, కో ఆప్షన్ మేంబర్ లు మారబోయిన రాంబద్రం, అజిత్ మియా, బిఆర్ఎస్ నాయకులు కొత్త వీరన్న, యశోదర్ జైన్, మైనార్టీ మండల అధ్యక్షుడు ఎస్ కే లాల్ మియా, ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షుడు ఏపూరి వెంకటేశ్వర్లు, మహిళా టౌన్ అధ్యక్షురాలు వెంకటమ్మ, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు