తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ అనుమతి పొంది క్రాకర్స్  స్టాల్స్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేనట్లయితే  చర్యలు తప్పవని పట్టణ సీఐ రాజశేఖర్ అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని
ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన దీపావళి క్రాకర్స్ దుకాణాలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా దుకాణాదారులతో  మాట్లాడుతూ ప్రతి దుకాణం ముందు ఇసుక బకెట్ లు, వాటర్ డ్రమ్ము , ఫైర్ సేఫ్టీ  సిలిండర్ ఉండాలని అన్నారు.దుకాణాలకు మధ్య  దూరం పాటించాలన్నారు.అగ్ని ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.పట్టణ  ప్రజలు తమ ఇంటివద్ద తగిన జాగ్రత్తలు పాటిస్తూ టపాసులు కాల్చాలని, పిల్లలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే టపాసులు కాల్చాలని అన్నారు.ప్రతి ఒక్కరూ వెలుగుల పండుగ దీపావళిని  ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు.పట్టణ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Attachments area