మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన నాటి నుంచి పెట్రోల్ ధరలు పెంచుతూనే ఉన్నారు
అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా దేశంలో కేంద్ర ప్రభుత్వ పెట్రో దోపిడి మాత్రం ఆగడం లేదు
ప్రస్తుతం ముడి చమురు బ్యారల్ ధర 95 డాలర్లకు తగ్గినా, పెట్రో రేట్లను తగ్గించడం లేదన్న కేటీఆర్
పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే దేశ ప్రజల నుంచి 26 లక్షల కోట్ల రూపాయలకు పైగా కేంద్రం వసూలు చేసింది
ఈ పెట్రో పన్నులను ప్రజల నుంచి గుంజి, కార్పోరేట్ల రుణాల మాఫీకి వాడుకుంటున్నదన్న కెటియార్
చట్టాన్ని మార్చుకుని మరీ సెస్సులు, సుంకాల పేరుతో భారీగా దోపిడీ చేస్తున్నది
అ నెపాన్ని రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటిదాకా పెట్రోల్ పైన ఒక్క రూపాయి అదనపు పన్ను వేయని తెలంగాణ లాంటి రాష్ర్ట ప్రభుత్వాలపైకి నెడుతున్నది
పెంచిన కొండంత ధరలను నామమాత్రంగా తగ్గించి, పేదల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నదని, ఇది ముమ్మమాటి నయవంచనకు పరాకాష్టనే అన్న కేటీఆర్
దేశంలో ఏర్పడిన దుర్భర ద్రవ్యోల్బణ పరిస్థితులు, కరోనా సంక్షోభ నేపథ్యంలో పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని కేటీఆర్ డిమాండ్
తన అసమర్థ విధానాలు, పరిపాలనతో దేశ ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా పెట్రో పన్నుభారం నుంచి భారత దేశ ప్రజలకు కాస్తయినా విముక్తి కలిగించాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారక రామారావు డిమాండ్ చేశారు. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు వంద డాలర్లకు కన్నా దిగువకు భారీగా తగ్గుతున్నా, ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఆమేరకు పెట్రో భారాన్ని ప్రజలపై తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మోడీ నాయకత్వంలోని కేంద్రం, పెట్రో ధరల పెరుగుదలకు అంతర్జాతీయ ముడిచమురు ధరలు కారణమంటూ చేస్తున్న వాదనలో డొల్లతనం ఇప్పుడు మరోసారి బయటపడుతున్నదన్నారు కేటీఆర్. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్యారెల్ ముడి చమురు ధర భారీగా తగ్గుతూనే వచ్చిందని, కాని ఘనమైన మోడీ గారి పాలనలో, దేశంలో పెట్రో రేట్లు మాత్రం పెరుగుతూ పోయాయన్నారు. రేట్లు పెంచిన ప్రతిసారి అంతర్జాతీయ ముడి చమురు ధరలను బూచీగా చూపడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. అంతర్జాతీయంగా బ్యారెల్ ముడిచమురు ధర తగ్గితే ఆ ప్రయోజనం ఎక్కడ దేశ ప్రజలకు ఇవ్వాల్సి వస్తుందో ఏమో అన్న కుటిల అలోచనతో మోడీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను, సెస్సులను భారీగా పెంచుతున్నదని, 2014 నుంచి ఇప్పటిదాకా పెంచడమే తప్ప తగ్గించడం తెలియదన్నట్టుగా పెట్రో ధరలను మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పదులసార్లు పెంచిందని కేటీఆర్ తెలిపారు. కార్పోరేట్ల పాదసేవ చేస్తూ, జాతి సంపదను అప్పనంగా వారికి కట్టబెడుతూ, దేశంలోని ఒక్కో వ్యవస్థను కబళిస్తూ మోడీ సర్కార్ జనాలను పీక్కుతింటున్నదన్నారు. ఇప్పటివరకు పెట్రో పన్నులు, సెస్సుల రూపంలో 26 లక్షల కోట్ల రూపాయలకు పైగా జనం జేబుల నుంచి దౌర్జన్యంగా దోచుకున్న మోడీ ప్రభుత్వం, మరోవైపు బ్యాంకుల నుంచి కార్పోరేట్ బడాబాబులు తీసుకున్న రుణాలను మాఫీ చేయడానికి ఆ మొత్తాన్ని ఉపయోగిస్తున్నదన్నారు. మోడీ ప్రేమ కార్పోరేట్ కంపెనీలపైననే కానీ, కాయ కష్టం చేసుకునే దిగువ, మద్యతరగతి వారిపై కాదన్నారు.
పెట్రో రేట్ల పెరుగుదల అనాటి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే అని అధికారంలోకి రాకముందు గొంతు చించుకున్న నరేంద్రమోడీ, ఇప్పుడు ధరల పెరుగుదలను ఆపడంలో తాను ఘోరంగా విఫలం అయ్యారని ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. 2014లో మోదీ సర్కారు ఏర్పాటైనప్పుడు బ్యారెల్ ముడిచమురు ధర దాదాపు 110 డాలర్లుగా ఉండేదని, 2015 జనవరి నాటికి అది 50 డాలర్లకు, 2016 జనవరిలో అయితే 27 డాలర్లకు పడిపోయిందన్నారు. ఇక 2020లో కరోనా లాక్డౌన్ అప్పుడు బ్యారెట్ ముడిచమురు ధర ఏకంగా 11 డాలర్లకు సైతం పడిపోయిందన్నారు. కానీ దేశంలో మాత్రం మోడీ ప్రభుత్వం ఏనాడు పెట్రో ధరలను అమేరకు తగ్గించిన పాపాన పోలేదన్నారు. కేంద్ర సంస్థల గణాంకాల ప్రకారం అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లు 2014 మే నుంచి 2017 సెప్టెంబరు మధ్యనే పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ 54 శాతం పెరిగితే, డీజిల్ మీద ఏకంగా 154 శాతం పెరిగిందన్నారు.
పెట్రో ధరలను పెంచి ప్రజల నుంచి భారీగా ఆదాయాన్ని గుంజిన మోడీ సర్కార్, దాన్ని మరింత పెంచుకునేందుకు బరితెగించిందన్నారు. 2020 వరకు పెట్రోల్, డిజీల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని గరిష్టంగా పెంచుకోవడానికి వీలుగా 2020 మార్చిలో చట్ట సవరణ సైతం చేసిందన్నారు. ప్రజలపై భా…
[6:35 pm, 24/08/2022] Janam Sir My Inspering: మీడియా మితృలకు విజ్ఞప్తి
రాష్ట్రంలో తొలిసారి ఈ రోజు రాత్రి వనపర్తి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సూచనల మేరకు వనపర్తి వజ్ర సంకల్పం పేరుతో 53 శాఖలకు చెందిన అధికారులతో 42 గ్రామాలు, 8 మున్సిపల్ వార్డులు మొత్తం 50 ఆవాసాలలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. స్వయంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఖిల్లా ఘణపురం మండలం ఆముదంబండ తండాలో, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మీన్ భాషా గారు ఖిల్లాఘణపురం మండల కేంద్రంలో , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశీష్ గారు ఖిల్లాఘణపురం మండలం కమాలుద్దీన్ పూర్ లో, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ గారు ఖిల్లాఘణపురం మండలం మామిడిమాడలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రేవల్లి, గోపాల్ పేట, ఖిల్లాఘణపురం, పెద్దమందడి, శ్రీరంగాపురం, వనపర్తి మండలాలలో
6 గ్రామాల చొప్పున, పెబ్బేరు మండలంలో 5 గ్రామాల్లో , పెబ్బేరు మునిసిపాలిటీలో 3 వార్డులు, వనపర్తిలో ఆరు వార్జులలో పల్లెనిద్రలు నిర్వహించనున్నారు.
దయచేసి హాజరై కవరేజి ఇవ్వగలరని మనవి.




