Thursday, 5 November 2026

తడి చెత్త,పొడి చెత్త సేకరణ గురించి అడిగి తెలుసుకున్న:-డిఎల్పిఓ

నాగిరెడ్డిపేట్:21 సెప్టెంబర్  జనం సాక్షి  నాగిరెడ్డి పెట్ మండలంలోని మెల్ల కుంట తండా గ్రామపంచాయతీని డీఎల్పీవో సురేందర్ బుధవారం సందర్శించి గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణ,పల్లె ప్రగతి పనులు పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు,నీటి వసతులు,వీధి దీపాల నిర్వహణ,ఇంటింటికి తిరిగి తడి చెత్త పొడి చెత్త సేకరణ గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సర్వీసింగ్ ఉన్నారు.