Monday, 2 November 2026

తపాలా బీమా పథకాలు వినియోగించుకోవాలి

సంగారెడ్డి,ఫిబ్రవరి2(జ‌నంసాక్షి): తపాలాశాఖ ద్వారా అమలు చేస్తున్న పాలసీల్లో బోనస్‌ ఎక్కువ ప్రీమియం తక్కువ వర్తించే పథకాలు అందుబాటులో ఉన్నాయని సంగారెడ్డి డివిజనల్‌ తపాలా శాఖ అధికారి అన్నారు. పాలసీ నిర్వహణ బాధ్యతలు ఉద్యోగులే నిర్వహిస్తున్నారని, శాఖలో ఏజెన్సీ వ్యవస్థ లేకపోవడం వల్ల ఏజెంట్‌లకు ఇచ్చే లబ్దిని పాలసీదారులకే వర్తింప జేస్తున్నామని అన్నారు. ఇతర ఏ శాఖల్లో లేని లబ్దిని తపాలా శాఖల ద్వారా అందుతుందన్నారు.తపాలా శాఖ ద్వారా కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తపాలా శాఖ ద్వారా ప్రజల ప్రయోజనం కోసం పలు రకాల పాలసీలు అందుబాటులోకి తెచ్చిందన్నారు. పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై, ఏపీవై తదితర పాలసీలు అందుబాటులో ఉన్నాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రమాద బీమా, మరణ బీమా, పింఛను బీమా ఇలా పలు రకాల పాలసీలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.