Monday, 2 November 2026

తప్పులు సరిచేసేనా?

మున్సిపల్‌ వార్డులపై అయోమయం
ఆదిలాబాద్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : ఒక పక్క మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటే అధికారుల వైఫల్యంతో మున్సిపల్‌ ఓటర్ల జాబితాలో అనేక తప్పులు దొర్లి రాజకీయ అవకాశం ఎదురు చూస్తున్న ఆశావహులకు తీవ్ర అసంతృప్తి ఎదురవుతోంది. ఇప్పటికే జాబితా సవరణకు రెండుసార్లు అభ్యంతరాల స్వీకరణకు గడువును ఇవ్వగా రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఓటర్లు
అయోమయానికి గురవుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తుంటే అధికారులు మాత్రం తప్పువిూద తప్పు చేస్తూ రాజకీయ ఆశావహులతో పాటు పట్టణంలోని ఓటర్లను ఆందోళనకు గురిచేస్తున్నారు. అయితే తమ ఓట్లు ఏకాలనీలో ఉన్నాయో, అసలు ఉన్నాయో లేవోనని ఓటర్లు మున్సిపల్‌ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. ఇదిలా ఉంటే పక్కడ్బందీగా మున్సిపల్‌ ఓటర్‌ జాబితాను సిద్ధం చేయాల్సిన మున్సిపల్‌ అధికారులు జాబితా తయారీలో అలసత్వం ప్రదర్శించడంతో బతికి ఉన్న వారి ఓట్లు రాక పోగా మరణించిన వారి ఓట్లు జాబితాలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అధికారులు ప్రకటించిన ఓటరు జాబితా తారుమారుకాగా తమ ఓట్లు ఎక్కడున్నాయోనని తెలుసుకునేందుకు ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలోని
పాత 36 వార్డులు, కొత్త 13 వార్డులు మొత్తం 49 వార్డుల్లో కులాల వారీగా నిర్దారిం చి ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. అయితే ఇందులో మైనార్టీలను, బీసీలను ఎస్సీలుగా జాబితాలో పేర్కొనడంతో ఇది చూసిన ఆశావహులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఒక్కసారిగా విస్మయానికి గురవుతున్నారు.