. ప్రతి .. జనం సాక్షి: -(ఆగస్టు 4) ప్రతిఆగస్ట 01 నుండి 07 తేదీ వరకు జరుపుకుంటాము. ఐ సి డి ఎస్ సూపర్వైజర్ పద్మావతి గారి ఆధ్వర్యంలో తేదీ04-08-2022. రోజున తల్లిపాల వారోత్సవాల సందర్భంగా రాయికల్ మున్సిపల్ అంగన్వాడి టీచర్లు అందరూ కలిసి రాయికల్ బాలికల ఉన్నత పాఠశాల పిల్లలతో స్కూల్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. పిల్లలతో తల్లిపాల ప్రాముఖ్యత గురించి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాయికల్ అంగన్వాడి టీచర్లు సుజాత, సువర్ణ, పద్మ ,ఉమాదేవి, రమాదేవి, సుమలత, పుష్పలత, సింధూరి, రజిత, లావణ్య, వనిత, రాజేశ్వరి, మరియు ఆశలు మరియు ఏఎన్ఎం భాగ్యలక్ష్మి, మరియు ఫాతిమా మరియు ఆయాలు పాల్గొన్నారు.




