తల్లి కొడుకు అదృశ్యం
దోమఅక్టోబరు 7 (జనం సాక్షి)
దోమ మండల పరిధిలో తల్లికొడుకు అదృశ్యమైన సంఘటన నిన్న రాత్రి చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే
దోమ SI విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం గూడూరు గ్రామానికిచెందిన
కోళ్ల నర్సింలు అనే యువకుడికి గత ఎనిమిది సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన నవనీత తో వివాహం జరిగింది వారికి ముగ్గురు సంతానం గత కొన్ని రోజులుగా రాత్రి సమయంలో ఫోన్ కాల్ వస్తున్నాయని గమనించిన భర్త మొన్న 5వ తేదీ కూడ సమయం
10 గంటల తర్వాత ఫోన్ రావడం జరిగింది అలా ప్రతి రోజు పది గంటల తర్వాత ఫోన్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి భర్త మందలించడంతో మనసులో ఉంచుకొన్న భార్య నవనీత నిన్న రాత్రి దాదాపు పది గంటలకు భోజనం చేసి తర్వాత అందరూ పడుకునాక చిన్న కొడుకు నవదీప్ తో ఇల్లు విడిచి వెళ్ళిపోయింది తన
రెండవ కూతురు దివ్యశ్రీ దాదాపు 12 గంటల ప్రాంతంలో తన దగ్గర కు వచ్చి చెప్పగ విషయం తెలుసుకున్న తండ్రి నర్సింలు చుట్టుపక్కల వాళ్ళని బంధువులని అడగగా ఫలితం లేకపోయింది చివరికి ఈరోజు దోమ పోలిస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వగ ఎస్ఐ విశ్వజన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు