తల్లి తల్లిపాలు అమృతం బిడ్డ ఆరోగ్యానికి రక్ష :జడ్పిటిసి రణం జ్యోతి.

దౌల్తాబాద్, ఆగస్టు 6,జనం సాక్షి.
మండల పరిధిలోని గొడుగుపల్లి, గాజులపల్లి, కోనాపూర్, శేరిపల్లి బందారం గ్రామాల అంగన్ వాడీ సెంటర్ల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని ప్రతి తల్లి బిడ్డకు పాలను తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తప్పకుండా త్రాగించాలని అందులో అనేక విలువగల విటమిన్లు ఉంటాయన్నారు. రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీ రణం జ్యోతీ, ఎంపీటీసీ నర్సమ్మ, సర్పంచులు అప్పవారి శ్రీనివాస్ , వంచ స్వప్న, ఏఎన్ఎంలు స్వరూప, అంగన్వాడీ టచర్లు,బాలింతలు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు