Wednesday, 4 November 2026

తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని తనయుడు

రుద్రుర్ (జనంసాక్షి): ఆయనకు తల్లి అంటే ప్రాణం తల్లికి కొడుకంటే ఎనలేని ఇష్టం.. ఒకరిని విడిచి మరొకరు ఎప్పుడూ ఉన్నది లేదు. మధ్యతరగతి కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి తల్లీకి తోడుగా పనులకు వెళ్తూ… వారికి ఉన్న ఉపాధి ఠీ సాకుతు కాలం గడుపుతున్నారు. కాని కాలం ఒకలా వుండదు కాదా కనిపెంచిన కన్నతల్లి ఇక లేదని తెలిసిన ఆ కుమారుడు తట్టుకోలేక బలవన్మరణానికి పాటు పడిన ఘటన రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన వడ్ల గంగారాం (46) అమ్మ 15 రోజుల క్రితం చనిపోగా, ఆరోజు నుండి తన తల్లి మరణం జీర్ణించుకోలేక, తనలో తాను బాధా పడి రాత్రి పూట తన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినాడు. తన భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడమైనది ఎస్సై రవీందర్ తెలిపారు