Thursday, 5 November 2026

తహసిల్దార్ కిషన్ ను సన్మానించిన టిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 22 (జనం సాక్షి) జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండల తహసిల్దార్ కిషన్ ను టిఆర్ఎస్ సీనియర్  నాయకులు మ్యతరి ఆనంద్ సన్మానించారు. సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో ఆయనకు కలిసి సన్మానించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా  కిషన్ ను  ఉత్తమ తాసిల్దారుగా ఎన్నిక కావడం తో  ఆయనకు కలిసి సన్మానించినట్లు ఆయన తెలిపారు. ఆయనతో పాటు స్థానిక టి ఆర్ ఎస్ నాయకులు పాల్గోన్నారు.