Monday, 2 November 2026

తహసీల్దార్ హత్యపై నిందితుడి తండ్రి వ్యాఖ్యలు

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యకు గురైంది. ఈ వ్యవహారంపై మీడియాతో నిందితుడు సురేష్ తల్లిదండ్రులు మాట్లాడారు. తన కొడుక్కి మతిస్థిమితం లేదని సురేష్‌ తండ్రి కృష్ణ అన్నారు. అసలు తహసీల్దార్‌ ఆఫీసుకు ఎందుకు వెళ్లాడో తెలియదన్నారు. తమకు ఉన్న భూమిపై హైకోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. భూమి వ్యవహారం తన కుమారుడు సురేష్‌కు ఏమీ తెలియదని చెప్పారు. ఎవరో కావాలని ఈ పని చేయించి ఉంటారని సురేష్‌ తల్లి పద్మ అనుమానం వ్యక్తం చేశారు.