తాండూరు గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవే స్తాం
తాండూరు అక్టోబర్ 5(జనంసాక్షి)తాండూరు గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని మున్సిపల్ కౌన్సిలర్ మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు.తాండూరు పట్టణం సమద్ ఫంక్షన్ హాల్ లో బుధవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమా వేశం ఆమేర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో నిర్వహిం చారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, అమేర్ అబ్దుల్లా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది ఎందరో వస్తుంటారు..పోతుంటారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికుల పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరింత బలోపేతానికి కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని కేటాయించిన వారికే మా మద్దతు తప్పకుండా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకు లు సర్దార్ ఖాన్, పి. బస్వరాజ్, సి.మల్లన్న కోర్వార్ నాగేష్, బషారాత్, సమ్యత్ శంకర్, సైయద్ జలాల్, మాజీ కౌన్సిలర్ లింగదల్లి రవికుమార్, కావలి సంతోష్ , ఆంకేష్ రాజు, బర్కతల్లి, అంజయ్య, మౌలాలీ పాష, భీమప్ప , బషీరాబాద్ శకరప్ప నవాజ్, జావీద్, గూళి పరమేశ్ .మోహమ్మద్ షోరేషీ, వడ్డే శ్రీనివాస్, సైపుల్లా, మరియు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




