సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేయాలి.
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్: సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేయాలని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో గురువారం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు తాళ్ళ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సాగర్ ఎడమ కాల్వ కింద వరి నాట్లు వేసిన రైతులు పొలాలు ఎండిపోయే దశకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని,ఎమ్మెల్యే ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చి సాగర్ నీటిని విడుదల చేయాలని అన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం 12 గంటలు కూడా సరిగా ఇవ్వడం లేదని మండిపడ్డారు,ఇప్పటికైనా 24 గంటలు కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు,అనంతరం పోలీసులు ధర్నా చేస్తున్న నాయకులను అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల అధ్యక్షులు సంకల మద్ది సత్య నారాయణ రెడ్డి, పార్థనపోయిన విజయ్ కుమార్, బిజెపి స్టేట్ కౌన్సిల్ మెంబర్,బాల వెంకటేశ్వర్లు,పాలక వీడు మండల అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డి,పట్టణ మండల ఉపాధ్యక్షులు, జూలూరి అశోక్, పల్లె పంగ వీరబాబు, పట్టణ మండల ప్రధాన కార్యదర్శులు, కొణతం నాగిరెడ్డి, ఊరిమిల్ల రామ్మూర్తి,బిజెపి నాయకులు,రాజేష్ రెడ్డి,ప్రవీణ్,సతీష్, సైదిరెడ్డి, ఓంకార్,సురేష్,నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




