తాండూరు హిందూ ఉత్సవ కేంద్రసమితికి లక్ష రూపాయల విరాళం.
మ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 2 (జనం సాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు హిందూ ఉత్సవ సమితికి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. శుక్రవారం తన నివాసంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి లక్ష రూపాయల చెక్కును హిందూ ఉత్సవ సమితి సభ్యులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పట్టణ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న ,హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్ల్లోళ్ళ నర్సింహులు, మరియు హిందూ ఉత్సవ సమితి కార్యదర్శులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకన్న గౌడ్, మనపురం రాము, పాండు పూజారి, పట్లోళ్ళ బాల్ రెడ్డి, రఘు, గంగాధర్, బోయ రాజు, అశోక్ ముదిరాజ్, రజక నరసింహ, ముత్యాల సాయి,నరేష్,ఆశిష్, కిరణ్ కుమార్, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు నాయకులు పాల్గొన్నారు.