తాటిపాముల గ్రామంలో అస్తవ్యస్తంగా ఉన్న బీటీ రోడ్లు

శ్రీరంగాపురం: అక్టోబర్ 14 (జనంసాక్షి):
శ్రీరంగాపురం మండలం తాటిపాముల గ్రామంలో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి బీటీ రోడ్డు మరమ్మత్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాములు యాదవ్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని తాటిపాముల నుంచి మల్లాయిపల్లి కి వెళ్లే మార్గంలో రోడ్లు గుంతల మయంగా మారాయి పక్కనే వీరసముద్రం నీరు ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. స్కూల్ బస్సు వెళ్లే మార్గం కాబట్టి ఇంతకుముందే ప్రమాదం వచ్చింది అధికారులు ప్రజా ప్రతినిధులు వెంటనే చొరవ తీసుకొని రోడ్డును బాగు చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాములు యాదవ్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లస్వామి వెంకటయ్య బాలరాజు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail