వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధి పనుల పై చర్చ

కొడకండ్ల, అక్టోబర్14(జనం సాక్షి ):వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు స్థానిక కార్యాలయం నందు మార్కెట్ కమిటీ చైర్మన పేరం రాము అధ్యక్షతన నిర్వహించబడింది. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ ఆదాయ పెంపునకు చేపట్టవలసిన చర్యల గూర్చి మార్కెట్ కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించారు. మార్కెట్ కమిటీ కార్యాలయంలో సమావేశ మందిరం, రైతు విశ్రాంతి భవనం, గోడౌన్ల మరమ్మత్తులు, సీసీ, కల్లాల ఏర్పాటుపై మార్కెట్ కమిటీ నిధుల నుండి చేపట్టవలసిన అభివృద్ధి పనుల గూర్చి ఏకగ్రీవంగా తీర్మానించారు. మార్కెట్ కమిటీ యార్డు నందు వ్యాపారస్తులచే రైతుల ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా మార్కెట్ చైర్మన్ పేరం రాము వ్యాపారస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ఎస్.నిరంజన్, మార్కెట్ కమిటీ సభ్యులు వైస్ చైర్మన్ అనంతొజు కృష్ణమూర్తి, డైరెక్టర్లు మైదం జోగేశ్వర్, షీలా ఎల్లప్ప, కుతాటి నరసింహులు, మహమ్మద్ షర్ఫుద్దీన్, నాగిరెడ్డి సంధ్య, పాలెపు నరేష్, బొక్క సత్యనారాయణ, బాశిపాక బిక్షపతి, సర్పంచ్ పసునూరి మధుసూదన్, ముత్తినేని సోమేశ్వరరావు, మార్కెట్ పర్యవేక్షకులు వి. నాగార్జున్, సిబ్బంది పాల్గొన్నారు.