Thursday, 5 November 2026

తారు రోడ్డు మంజూరు చేయాలి

డుంబ్రిగుడ(ఫిబ్రవరి 15 జనం సాక్షి) మండలంలోని సాగర పంచాయితీ గద్య గుడ,పోడగుడ గ్రామాలకు తారురోడ్డు తక్షణమే మంజూరు చేయాలని మంగళవారం గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సూర్య నారాయణ ఆధ్వర్యంలో అయ్యా గ్రామాల గిరిజనులు ఆందోళన చేపట్టారు.అనంతరం గ్రామాలను పర్యటించి గ్రామంలో నెలకొన్న ప్రధానమైన సమస్యలను గ్రామస్తులతో అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోవ రోడ్డు కుసుమగుడ కూడలి నుంచి గద్యగుడ మీదిగా పోడగుడ వరకు సుమారు రెండు కిలోమీటర్లు కంకర రాళ్లతో అసంపూర్తిగా ఉన్న మట్టి రోడ్డును తారు రోడ్డుగా మంజూరు చేసి ప్రారంభించాలని రెండు గ్రామాల యువకులతో ఆందోళన చేపట్టారు.ఈ కార్యక్రమంలో కె.బాబురావు,కె.రాజు,కె.పవన్ కుమార్,రామచంద్ర రావు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.