-జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం..
గద్వాల :- సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య అధ్వర్యంలో జిల్లా పరిషత్తు కార్యాలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనతో నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల కోరిక తీర్చిన ఘనత ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికే దక్కుతుందని,రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కి తీసుకెళ్లి దేశంలో నే తెలంగాణ రాష్ట్రం కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ జన్మదినాన్ని కోలాహలంగా, పండుగ వాతావరణం లో నిర్వహిస్తామన్నారు…అందులో భాగంగా జిల్లా అంతటా సీఎం కేసీఆర్ జన్మదిన సంబరాలలో అంబరాన్నంటాయి.ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ సరోజమ్మ రమేష్ నాయుడు, జెడ్పిటిసిలు పద్మ వెంకటేశ్వర్ రెడ్డి,బాసు శ్యామల హన్మంతు నాయుడు, రాజశేఖర్,రాములమ్మ,సుగుణమ్మ ముగన్న,
ఎంపిపిలు విజయ్,రాజారెడ్డి, భీసమ్మ,జెడ్పి కొఆప్షన్ మెంబర్ ఇమ్మామ్ సాబ్,ప్రజాప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.




