బషీరాబాద్ జులై 26, (జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో తాహశీల్ధార్ కార్యాలయం ముందు విఆర్ఏల ధర్నా రెండో రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల అధ్యక్షులు అంజయ్య మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ సంఘం పిలుపు మేరకు 25వ తేదీ నుండి తాహశీల్ధార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నాము.వెంటనే పేస్ కౌల్ నమోదు చేయాలి. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలి.వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల ఉప అధ్యక్షులు నర్సిములు,కార్యదర్శి శ్రీశైలం, వెంకటయ్య,హైమద్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area




