*తాహసిల్దార్ కార్యాలయన్ని దిగ్బంధించిన వీఆర్ఏలు*
బాల్కొండ అక్టోబర్ 10 (జనం సాక్షి ): ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీలో ఇచ్చిన హామీని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం బాల్కొండ తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధించారు.వీఆర్ఏలు చేపడుతున్న నిరవధిక సమ్మె సోమవారానికి 78వ రోజుకు చేరింది.ఇన్ని రోజులు నిరవధిక సమ్మె చేపడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండలాధ్యక్షుడు చెన్న నల్లన్న,ఉపాధ్యక్షుడు నలారి రాజేశ్వర్, కృష్ణంరాజు,వెంకటేష్,బేగరి నారాయణ,సతీష్,బీసా సాయన్న, భారతి,జమున,రాధ,రజిత తదితర విఆర్వోలు పాల్గొన్నారు.