*యావత్ దేశమే కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతోంది*
*నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*
రామన్నపేట అక్టోబర్ 10 (జనంసాక్షి) యావత్ దేశమే సిఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుతోందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు, సోమవారం రామన్నపేట పట్టణానికి చెందిన నలభై గీత కార్మికుల కుటుంబాలు సిఎం కేసీఆర్ నాయకత్వానికి, టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో గులాబి కండువా కప్పుకున్నారు, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కొరకు సీఎం కెసిఆర్ అవలంభిస్తున్న పథకాలు, పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులయ్య తామంతా ఏకతాటిగా టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు, రాష్ట్రమంతా జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు గురించి, అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వారికి ఎమ్మెల్యే చిరుమర్తి వివరించారు, టిఆర్ఎస్ పార్టీ ద్వారానే మన గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి జరుగుతున్నాయని, కులమతాలకు అతీతంగా కెసిఆర్ గారికి అండగా ఉండాలని ఆయన వారిని కోరారు. వారి వెంట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీలు గొరిగే నరసింహ, దోమల సతీష్ పట్టణ అధ్యక్షులు పోతరాజు సాయికుమార్
Attachments area