తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన నల్లగొండ జిల్లా ఎస్పీ: రెమా రాజేశ్వరి
నల్గొండ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి బుధవారం తిరుమలగిరి సాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు .అనంతరం ఆమె రికార్డులను పరిశీలించి పోలీస్ స్టేషన్ నూతన భవనం కోసం స్థల పరిశీలన చేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ హాలియా వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డులో నిర్వహిస్తున్నారు. ఇదే మార్కెట్ యార్డులో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కోసం ఆమె మిర్యాలగూడ డి.ఎస్.పి వై వెంకటేశ్వరరావు, తహసిల్దార్ పాండు నాయక్ ల తో కలిసి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పక్కా భవనానికి మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు . 2022 సంవత్సరం లోనే భూ సేకరణ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్ జడ్పిటిసి సూర్య ,సీఐ నాగరాజు, ఎస్సై పెద్దపంగ బాబు, సర్పంచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య, నాగెండ్ల కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.