Tuesday, 3 November 2026

నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన…ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ

 

కూకట్ పల్లి (జనంసాక్షి): శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతుందని ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. బుధవారం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ 2వ ఫేస్ లోగల జి ఎస్ ఆర్ నగర్ లో రూ.53.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్,నార్నే శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు లతో కలిసి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ సహకారంతో శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు.ఈ కార్యక్రమంలో జి.ఎచ్.ఎమ్.సి జలమండలి డీజీఎం వెంకటేశ్వర్లు, ఎ.ఈ సుభాష్, మేనేజర్ ఝాన్సీ, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు జిల్లా గణేష్, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, భాస్కర్ రెడ్డి, యాదగిరి, కైసర్, కృష్ణారావు, అంజిరెడ్డి, వాసుదేవరావు, రవీందర్, సాయిగౌడ్, దేవి, అంజలి, ఇస్మాయిల్, వర్క్ఇస్పెక్టర్ రవీందర్ రెడ్డి, సూపర్వైజర్ శివ తదితరులు పాల్గొన్నారు.