Tuesday, 3 November 2026

తిరుమల శ్రీవారి సేవల పేరుతో ఘరానా మోసం

హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారి సేవల పేరుతో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. శ్రీవారి వస్త్రాలు, అభిషేకం టిక్కెట్ల పేరుతో నిందితుడు రూ.20 లక్షల మేర వసూలు చేశాడు. ఎస్‌ఆర్‌నగర్‌ పీఎస్‌లో రాజ్‌కుమార్‌ రెడ్డిపై శివబాగ్‌కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. నిందితుడు రాజ్‌కుమార్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో నిందితుడు నేర చరిత్రను పోలీసులు గుర్తించారు. విజయవాడలో టీటీడీ సేవ పేరుతో మోసగించినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.