Wednesday, 4 November 2026

పండుగ పూట.. ప్రాణం తీసిన గాలిపటం..

భవనంపై నుంచి కిందపడ్డ యువకుడు

చికిత్స పొందుతూ యువకుడు మృతి

హైదరాబాద్‌,జనవరి14(జ‌నంసాక్షి): సంక్రాంతి పండుగ ఓ ఇంట్లో విషాదాన్ని నింపిది. సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేస్తుండగా… ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ బాలగంగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… వారాసిగూడ అంబర్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ముక్తార్‌ పెద్ద కుమారుడు ఇమ్రాన్‌ అలియాస్‌ ఖలీద్‌ (27) తండ్రి స్కాప్ర్‌ వ్యాపారంలో పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఖలీద్‌ తన ఇంటి రెండో అంతస్తులో స్నేహితులతో కలసి గాలిపటాల్ని ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఖలీద్‌ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.