తీరనున్న కిన్నర్ పల్లి గ్రామస్థుల కష్టాలు
– ఫలించిన తుల అరుణ్ కృషి
– ముందుకొచ్చిన బాలవికాస సంస్థ
బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : మండలంలోని కిన్నర్ పల్లి గ్రామస్థులు ఫ్లోరైడ్ నీటితో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు ఇప్పటికే గ్రామంలో 13 మంది కిడ్నీ వ్యాధితో మరణించారు అయితే ఆ గ్రామ కష్టాలను కిడ్నీ వ్యాధి గ్రస్తులను చూసి చలించి పోయిన తుల సుభాష్ ఫౌండేషన్ చైర్మన్ తుల అరుణ్ కుమార్ గ్రామాన్ని సందర్శించి వారికి సహాయ సహకారాలు అందిస్తామని గతంలో మాటిచ్చాడు ఇచ్చిన మాట కోసం దాదాపు సంవస్థర కాలం నుండి ప్రయత్నం చేయగా విషయం బాల వికాస సంస్థ దృష్టికి తీసుకుని వెల్లి ఆ సంస్థ ప్రతినిధి ప్రసున్ రెడ్డి తో శుక్రవారం గ్రామాన్ని సందర్శించి పనులను ప్రారంభించారు అతి త్వరలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అన్ని పనులు పూర్తి చేసి తాగు నీటి వసతి కల్పిస్తామని తెలిపారు అలాగే ఈ విషయాన్ని ఎమ్మెల్యే బాపురావు కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు తమ గ్రామ కష్టాలను తీర్చేందుకు వచ్చిన బాల వికాస సంస్థ వారికి తుల అరుణ్ కుమార్ రాథోడ్ బపురావ్ జిల్లా కలెక్టర్ కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు
Attachments area