తుమ్మన్ పల్లి లో ఆసరా పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్రావు
ఝరాసంగం సెప్టెంబర్ 26 (జనం సాక్షి) మండల పరిధిలోని తుమ్మన్ పల్లి లో ఆసరా పింఛన్ కార్డులను శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, మొద్దు కాలు ఉన్నవారికి, ఫైలేరియా వ్యాధి ఉన్నవారికి, ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారికి, రూ.2,016 మరియు వికలాంగులకు రూ.3,016 ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది అంటే భారతదేశంలోనే అది ఓకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.
ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో సర్పంచ్ నవాజ్ రెడ్డి, టి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు సంగమేశ్వర్ పాటిల్ సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు జాగదీశ్వర్ రైతు సమన్వయ అధ్యక్షుడు సుభాష్ రావు,ప్రధాన కార్యదర్శి నర్సిములు పాటిల్, గ్రామ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, మాజీ ఎంపిటిసి నవాజ్ రెడ్డి నాయకులు సురేష్ మల్లేష్, డేవిడ్, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.