గుడిహత్నూర్: ఆగస్టు 31 జనంసాక్షి మండలం లోని సూర్యగుడా,ఉమిరి, సీతాగొంది గ్రామ పంచాయతీల్లో తెరాస నూతన కమిటీ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ మండల కన్వీనర్ కరాడ్ బ్రమనంద్ తెలిపారు. సూర్యగుడా గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కుమ్ర అచ్చoథ్ రావ్ కార్యదర్శి గా sk రహీం సీతాగొంది లో అధ్యక్షుడిగాపాటిల్ రందస్ కార్యదర్శిగా రఫిక్ ఉమిరి తెరాస గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మెస్రం ప్రభు కార్యదర్శిగా కాంలే ధమ్మానంద్ లను నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యగుడా సర్పంచ్ లింగు మాజీ ఎంపీటీసీ సభ్యులు నాయకులు తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
తెరాస గ్రామ కమిటీల ఎన్నిక..




