రాయపర్తి, ఆగస్టు 31( జనంసాక్షి):
ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచాలని స్థానిక ఉప సర్పంచ్ మహమ్మద్ మహమూద్ అన్నారు. మండల కేంద్రంలోని జల శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ఇంకుడు గుంతల యొక్క ప్రాధాన్యతను వివరించి, ఇంకుడు గుంతలకు ముగ్గు పోసి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ మహమ్మద్ మహమూద్ మాట్లాడుతూ ఈ రోజుల్లో తరిగిపోతున్న భూగర్భ జలాలను ఎలాగైనా కాపాడుకోవాలని భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా చేయాలని అన్నారు. ప్రతి ఇంటి నీటి అవసరాలకు బోర్లు వేయడం జరుగుతుందని చాలా లోతు నుండి భూగర్భజలాలను పైకి తీసి నీటిని వాడుతున్నారని, అవసరం ఉన్న దాని కన్నా ఎక్కువ నీటిని వాడడం వల్ల నీటి వృధా అవుతుందని ఇలా నీటిని వృధా చేయడం వల్ల భవిష్యత్తులో నీటి సమస్యలు తప్పవని కాబట్టి ముందు జాగ్రత్తగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు, నీటి వినియోగాన్ని కూడా పొదుపుగా వాడుకోవడం వల్ల కొంత మేరకు భూగర్భ జలాలను పెంచుకోవచ్చని వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ , కోతి కళ్యాణ్, ఎనగందుల సంతోష్ కుమార్, బండి బాలరాజ్, రఫీ, రమ, రియాజ్, అఖిల్ , అనిల్ పాల్గొన్నారు.




