బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు ,ఫ్యాక్స్ మాజీ చైర్మన్ కొలను
ఎల్బీనగర్ (జననం సాక్షి ) టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గంలో ఆధిపత్య పోరుతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యతిరేక వర్గాలుగా చీలిపోయినట్లు నటిస్తూఆ ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసే కుట్రలో భాగమని బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు ఫ్యాక్స్ మాజీ చైర్మన్ కొలను శంకర్ రెడ్డి ఆరోపించారు . గురువారం నాడు పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కొలను శంకర్ రెడ్డి మాట్లాడుతూ కబ్జాలు , ఆసమర్థతలు తెరాస పార్టీకి ఇప్పుడు గుర్తకు వస్తున్నాయా అని ప్రశ్నించారు .. ఆనాడు బిజెపి మద్దతుతో గెలిచిన తీగల కృష్ణారెడ్డి వందరోజుల్లోనే టీఆర్ఎస్లోకి జంప్ చేయడం జరిగిందని అన్నారు .ఈనాడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా గెలిచివంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ వీడి టీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారని గుర్తు చేశారు . ఈ విషయంలో ఇద్దరూ దొందూ దొందేనని కొలని శంకర్ రెడ్డి అన్నారు .




