ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి శ్రీ ముద్దగౌని
ఎల్బీ నగర్( జనం సాక్షి ) అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని బోనాల పండుగ సందర్బంగా ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి శ్రీ ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ అన్నారు . వనస్థలిపురం డివిజన్ హస్తినాపురం ఈస్ట్ కాలనీలోని శ్రీ దుర్గా పోచమ్మ అమ్మవారి దేవాలయంలలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజాకార్యక్రమంలలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి దేవాలయం వద్ద తెరాస పార్టీ యువ నాయకులు శ్రీ షేర్ రమణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు . ఈ కార్యక్రమంలో షేర్ రమణ్ , కాలని అధ్యక్షులు భూపతి రెడ్డి , భానుప్రకాష్ , శరణ్ , విజయేష్ , శశి, పి. రాజుశేఖర్ గౌడ్ తదితరులున్నారు .




