తెలంగాణగుజరాతీ ఏక్తా మహోత్సవ్ నృత్యాలతో అలరించిన క్రీడాకారులు
సికింద్రాబాద్ డిసెంబర్ 04( జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు సమీపంలో ఆరు లక్షల మంది గుజరాతీయులు నివసిస్తున్నామని, గుజరాతి ప్రతినిధులు తెలియజేశారు.
నిన్న రాత్రి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఇంపీరియల్ గార్డెన్ లో గుజరాతి ఏక్త మహోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గుజరాతి ప్రతినిధులు మాట్లాడుతూ మార్వాడిలోని వివిధ కులాల ప్రతి నిధుల మంతా వ్యాపారాలు చేసుకుంటున్నామని హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ గుజరాతీల యొక్క అతిపెద్ద ఈవెంట్. గేమ్ 24, 4 జనవరి 2024 నుండి నిర్వహించ బడుతుంది,మరియు గుజరాతీల భారీ రోడ్ షోతో ప్రారంభమై 4 నెలల పాటు ప్రదర్శించ బడుతుంది-4 నెలల ఈవెంట్ క్రీడలు,క్రికెట్, మహిళల కోసం బాక్స్ క్రికెట్,బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్,కిడ్స్ ఫ్యాషన్ షో, మిస్ & తెలంగాణ గుజరాతీ,డాన్స్ గుజరాతీ డ్యాన్స్,నాచ్ బలియే& చాలా ఎక్కువ, గుజరాతి ఏక్తా మహోత్సవ్ గేమ్ 24 యొక్క గ్రాండ్ ఫినాలే ఏప్రిల్ 2024లో ప్రదర్శించ బడుతుంది.అందులో భాగంగానే వివిధ సంస్కృతి సంప్రదాయాలు, క్రీడల పట్ల పిల్లలకు అవగాహన కల్పిస్తూ,ఉన్నత చదువులు చదివిస్తూ,పెద్దవారు వివిధ వ్యాపార వ్యాపారాలలో ముందుకు వెళ్లాలని,ఇలాంటి మహోత్సవాలను జరుపు కుంటామని తెలిపారు.విద్యార్థులకు వివిధ క్రీడ పోటీలు నిర్వహించారు.గెలుపొందిన వారికి బహుమతులను కూడా అందజేశారు.
విద్యార్థి విద్యార్థులు చేసిన సంస్కృతి కార్యక్రమాలను గుజరాతీయులను ఎంతో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ప్రేమల్ పరేఖ్,చందుభాయ్ పటేల్,చేతన్ బోఘని, మినల్ వఖారియా పెద్ద సంఖ్యలో గుజరాతీలు పాల్గొన్నారు