తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్: దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ అమలు చేస్తుందని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల పరిధిలోని గ్రామాలకు చెందిన పలువురికి సోమవారం మండల కేంద్రంలోని ఎస్కేఎస్ ఫంక్షన్ హాల్ లో ఆసరా గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే సైదిరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే టిఆర్ఎస్ గవర్నమెంట్ ధ్యేయమని అన్నారు. పెన్షన్ దారులు అంతా ఉద్యోగులతో సమానమని, ఇవి పెన్షన్ కార్డులు కావు ఆత్మగౌరవ కార్డులని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు దమ్ము, ధైర్యం ఉంటే అభివృద్ధిలో పోటీ పడు కానీ అభివృద్ధికి అడ్డుపడి కోర్టు లో కేసులు వేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి బిక్షం, జడ్పిటిసి రాపోలు నరసయ్య, వైస్ ఎంపీపీ తాళ్లూరి లక్ష్మీనారాయణ, ఎంపీడీవో శంకరయ్య, పిఎసిఎస్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.