మృతురాలి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది..

సర్పంచ్ విజయమ్మపాండురంగారెడ్డి.
ఊరుకొండ, ఆగస్టు 29 (జనం సాక్షి):
మృతురాలి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని సర్పంచ్ విజయమ్మ పాండురంగారెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం ఊర్కోండ మండలం రాచాలపల్లి గ్రామానికి చెందిన వడ్ల కృష్ణమ్మ (60) అనారోగ్యంతో మృతిచెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి గారు మృతురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభుతి తెలియజేస్తూ రూ.5000/- మరియు గ్రామ సర్పంచ్ శ్రీమతి G.విజయమ్మ పాండురంగా రెడ్డి గారు* మృతురాలి కుటుంబసభ్యులను ఓదార్చి తమవంతు సహౕయంగా రూ.5000/- మరియు స్థానిక మాజీ ఎంపిపి దీప గోపాల్ రెడ్డి తమప్రగాఢ సానుభుతి తెలియజేస్తూ రూ.5000/- మొత్తం రూ.15,000/-రూపాయలు ఆర్థిక సహాయం మృతురాలి కుమారుడు వడ్ల రామచారికి అందజేశారు. వడ్ల కృష్ణమ్మ మృతి పట్ల పలువురు గ్రామ ప్రజలు మరియు నాయకులు ఆమే కుటుంబ సభ్యులను ఓదార్చి తమ ప్రగాఢ సానుభుతి తెలియచేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరుశ రాములు, వార్డుసభ్యులు నరేష్, టిఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్, లక్ష్మయ్య యాదవ్, రమేష్ గౌడ్, నర్సింహా, చిన్న హుస్సేన్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.