హైదరాబాద్:తెలంగాణలో కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలు, బీసీ సబ్ ప్లాన్ సాధన కోసం సీపీఎం నగర కమిటీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. కబ్జా భూముల స్వాధీనం చేసుకొని పేదలకు ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో బాబుపై కేసు పెట్టి అరెస్ట్ చేయకపోతే ప్రజలకు అవమానం అని స్పష్టం చేశారు.




