హైదరాబాద్,జూన్11(జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని మాజీ లోక్‌సభ స్పీకర్ విూరాకుమార్ ఆరోపించారు. తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని, దళితులకు పాలించే అర్హత లేదా అంటూ ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి దళితుడైన రాజయ్యను తొలగించారని, అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యే సంపత్‌ను అకారణంగా ఎక్స్‌పెల్ చేశారని మండిపడ్డారు. తెలంగాణలో స్వేచ్ఛను హరించే ప్రయత్నం జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని బలోపేతం చేయాలని విూరాకుమార్ కోరారు. వరగంల్ సభకు హాజరయ్యారు.




