తెలంగాణ ఆడపడుచులకు నిజమైన తోబుట్టువు సీఎం కేసీఆర్

గర్భిణీ స్త్రీలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరం, పోషణ,సంరక్షణ;మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ
కోదాడ టౌన్ సెప్టెంబర్ 21 ( జనంసాక్షి )
కోదాడ పురపాల సంఘము పరిధి లోని తమ్మర మరియు పట్టణం లోని ముస్లిం శాదిఖాన లో ఐసిడిఎస్ వారి ఆధ్వర్యంలో  జరిగినటు వంటి పోషణ అభియాన్,పోషణ మాసం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ హాజరై పట్టణ పరిధి లోని గర్భిణీ స్త్రీలకు సలహాలు సూచనలు ఇచ్చి వారికి శ్రీమంతం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పోషణ అభియాన్,పోషణ మాసం పథకంను గర్భిణీ స్త్రీలు, బాలింతలు,చిన్నారులు సద్వినియోగం చేసుకోని, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఎలా పొందాలో తెలుసుకొని, తినే ఆహారంలో పోషకాలు నష్టపోకుండా చూసుకోవాలని తెలిపారు.గర్భిణీలు రక్తహీనతకు గురికాకుండా ఐరన్ సంబంధిత ఆకుకూరల రోజుకి ఒక్కసారి అయిన తీసుకోవాలి అని, అంగన్ వాడి లో లభించే గుడ్లు మరియు బాలామృతం ద్వారా పోషకాలు ఎక్కువగా పొందవొచ్చు అని తెలిపారు.
అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం,పిల్లలకు అన్నప్రసన్న మరియు అక్షరాభిశేకం చేశారు.ఈ కార్యక్రమం లో వీరితో పాటు కౌన్సిలర్స్ సామినేని నరేష్,హనుమంతరావు,విజయ చంద్రిక,సూపర్వైజర్  శివకుమారి,రమణ,అంగన్వాడీ టీచర్స్ తయ్యబు,రాధ రుక్మిణీ,సీత,స్వరూప,లాల్బీ,వెంకట్రమన,రమ,జాన్వీ తదితరులు పాల్గొన్నారు.