*తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి.*

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్.తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.బుదవారం నేరేడుచర్ల పట్టణంలో  పద్మశాలి సంఘం అధ్యక్షుడు పిల్లలమర్రి పుల్లారావు ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు,కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరై కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించినారు.అనంతరం ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లడుతు కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు అని రాష్ట్ర సాధనలో అయన పోషించిన పాత్ర అమోఘమని,తొలి దశ పోరాటంలో చరుకుగా వ్యవహరించడమే కాకుండా మంత్రి పదవిని కూడా తృణపాయంగా త్యజించిన  త్యాగశీలి.తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే ప్రత్యేక రాష్ట్ర సాధన తప్ప వేరే మార్గం లేదని విశ్వసించారని కొనియాడారు.అనంతరం బాలేనా వెంకటకృష్ణ కూతురు అనారోగ్యంతో హాస్పటల్లో చికిత్స పొందుతున్న కుమారి నవ్య కు 2లక్షల 50వేల ఎల్ఓసిని అందజేశారు.ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు,డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి,గ్రంథాలయ చైర్మన్ గుర్రం మార్కండేయ,పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరి సైదులు, కౌన్సిలర్ షేక్ భాష,వింజమూరు రాములు,మాజీ జెడ్పిటిసి ముషం నరసింహ,మాజీ మార్కెట్ చైర్మన్ వల్లంశట్ల రమేష్ బాబు,మాజీ ఎంపీటీసీ నాగండ్ల శ్రీధర్,మాజీ సర్పంచులు ఆకారపు వెంకటేశ్వర్లు,సత్యనారాయణ రెడ్డి పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి ఎర్రమాద యాదగిరి,మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి నరసింహ, బాలిన సైదులు,మహిళా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రమాద, సావిత్రి,పద్మశాలి సంఘం కోశాధికారి రమేష్,ఉపాధ్యక్షులు నక్క గిరిబాబు,ఏలే లక్ష్మణ్, ఆర్గనైజర్ సెక్రెటరీ రావిరాల యుగంధర్,పద్మశాలి సంఘం నాయకులు బాలన నరసింహారావు, అక్కలదేవి రవి,ఎర్రమాద చంద్రమౌళి,రెబ్బ సత్యనారాయణ,రాంబాబు,శేఖర్,నాగరాజు  శ్రీనివాస్,ఉపేందర్,చంద్రం,సతీష్ సాంబయ్య,తదితరులు పాల్గొన్నారు.