తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన జైపాల్ రెడ్డి

జిల్లా అభివృద్ధికి జైపాల్ రెడ్డి సేవలు మరువలేనివి

డి సి సి అధ్యక్షుడు జి. మధుసూదన్ రెడ్డి

(మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి)

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి, దివంగత కాంగ్రెస్ నాయకుడు ఎస్.జైపాల్ రెడ్డి కీలకపాత్ర పోషించారని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం దివంగత మాజీ కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జైపాల్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో తన ప్రసంగాలతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచినట్లు గుర్తు చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా నిలిచారని అన్నారు. కేంద్రమంత్రిగా జైపాల్ రెడ్డి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అనేక నిదులు కేటాయించినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కు జైపాల్ రెడ్డి చేసిన సేవలు మరువలేనిమన్నారు . కాంగ్రెస్ మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాయి బాబా, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి.ఫయాజ్, నాయకులు వెంకటయ్య. నాగరాజు, అనిల్ రెడ్డి, సిరాజ్, ఫక్రు, మురళి, అష్షు, జగదీష్, శంకరయ్య, చంద్రమౌళి, అలీ, రాంచంద్రయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు