గౌరవ సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి మీర్ పేట చౌరస్తా నుండి బడంగ్ పేట వరకు దాదాపు 6 కిలోమీటర్ల భారీ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపిటిసిలు, సర్పంచులు, వార్డు సభ్యులు, నియోజకవర్గ స్థాయి రైతు బంధు సమితి అధ్యక్షులు, సభ్యులు, TRS పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళ సంఘాల నాయకురాళ్లు, నియోజకవర్గ పరిధిలోని అన్ని పాఠశాలల విద్యార్థులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




